బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!
- తక్కువ క్యాలరీలు తీసుకోవడం పెద్ద పొరపాటు
- హెల్తీ ఫుడ్స్ కూడా పరిమితంగానే తినాలి
- ఆహారంలో ప్రోటీన్ కచ్చితంగా ఉండాలి
- కూల్ డ్రింక్స్ లిక్విడ్ క్యాలరీలతో ముప్పు
- ఒత్తిడి వల్ల అతిగా తినడం ఆపాలి
చాలామంది బరువు తగ్గాలనే ఆరాటంలో రకరకాల డైట్లు ఫాలో అవుతుంటారు. అయితే, సరైన అవగాహన లేక బరువు తగ్గాల్సింది పోయి మరింత పెరిగిపోతుంటారు. బరువును అదుపులో ఉంచుకోవడానికి కేవలం తక్కువ తినడం మాత్రమే కాదు.. జీవక్రియలు, క్యాలరీల సమతుల్యత కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. డైటింగ్ చేసేటప్పుడు సాధారణంగా చేసే కొన్ని చిన్న పొరపాట్లు బరువు తగ్గకుండా ఎలా అడ్డుపడతాయో ఇప్పుడు చూద్దాం..
1. తక్కువ క్యాలరీలు తీసుకోవడం
త్వరగా బరువు తగ్గాలనే ఆశతో చాలామంది శరీరానికి కావలసిన దానికంటే చాలా తక్కువ క్యాలరీల ఆహారాన్ని తీసుకుంటారు. దీనివల్ల శరీరం ‘స్టార్వేషన్ మోడ్’లోకి వెళ్లిపోయి జీవక్రియల వేగం మందగిస్తుంది. కాబట్టి క్యాలరీలను ఒకేసారి కాకుండా రోజంతా క్రమ పద్ధతిలో విభజించి తీసుకోవాలి.
2. భోజనాన్ని స్కిప్ చేయడం
పని ఒత్తిడి వల్లనో లేదా త్వరగా సన్నబడొచ్చనే భ్రమతోనో చాలామంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లేదా మధ్యాహ్నం భోజనాన్ని మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆకలి హార్మోన్లు దెబ్బతిని ఆ తర్వాత వచ్చే భోజనంలో ఎక్కువగా తినేసే ప్రమాదం ఉంది. ఇది రక్తంలో చక్కెర స్థాయుల హెచ్చుతగ్గులకు, మెటబాలిక్ లోపాలకు దారితీస్తుంది.
3. ‘హెల్తీ ఫుడ్స్’ ఎక్కువగా తినడం
డ్రై ఫ్రూట్స్, నట్స్, గ్రనోలా, స్మూతీలు ఆరోగ్యానికి మంచివే అయినా.. వీటిలో క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. హెల్తీ ఫుడ్స్ కదా అని వీటిని మితిమీరి తింటే బరువు తగ్గడం సాధ్యం కాదు. కాబట్టి పోషక విలువలతో పాటు అవి ఎంత పరిమాణంలో తీసుకుంటున్నామనే ‘పోర్షన్ కంట్రోల్’ ముఖ్యం.
4. ప్రొటీన్ తక్కువగా తీసుకోవడం
ఆహారంలో ప్రొటీన్ తగినంత లేకపోతే కండరాలు క్షీణిస్తాయి. ఫలితంగా కొవ్వు పెరుగుతుంది. ప్రొటీన్ ఎక్కువగా ఉండే గుడ్లు, పప్పులు, పన్నీర్ వంటివి తీసుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలిగి ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఇది లాంగ్ టర్మ్ వెయిట్ లాస్‌కు ఎంతో సహాయపడుతుంది.
5. లిక్విడ్ క్యాలరీలను పట్టించుకోకపోవడం
మనం తినే ఆహారంతో పాటు తాగే పానీయాల వల్ల కూడా శరీరంలోకి క్యాలరీలు చేరుతుంటాయి. మార్కెట్లో దొరికే ప్యాక్డ్ జ్యూస్‌లు, కూల్ డ్రింక్స్, షేక్స్‌లో చక్కెరలు ఎక్కువగా ఉండటం వల్ల తెలియకుండానే బరువు పెరుగుతారు. వీటికి బదులు మజ్జిగ, నిమ్మరసం వంటి సహజ పానీయాలు లేదా నీళ్లు ఎక్కువగా తాగాలి.
6. ఒత్తిడిలో ఎక్కువగా తినడం
చాలామంది ఆఫీస్ పని లేదా చదువు ఒత్తిడి వల్ల మానసికంగా అలసిపోయినప్పుడు ‘ఎమోషనల్ ఈటింగ్’ చేస్తుంటారు. ఒత్తిడి వల్ల విడుదలయ్యే కార్టిసాల్ హార్మోన్ జంక్ ఫుడ్ తినాలనే కోరికను పెంచుతుంది. కాబట్టి మైండ్‌ఫుల్ ఈటింగ్ అలవాటు చేసుకుంటూ.. యోగా, వాకింగ్ ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి.
7. క్రాష్ డైటింగ్‌ల వైపు వెళ్లడం
మార్కెట్లో ట్రెండ్‌గా మారే క్రాష్ డైట్‌లు, అశాస్త్రీయ పద్ధతులను ఫాలో అవ్వడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందక నీరసించిపోతారు. ఇలాంటి డైట్ల వల్ల బరువు తగ్గినట్లే తగ్గి మళ్లీ అంతే వేగంగా పెరిగిపోతారు. బరువు తగ్గడం అనేది ఒక రాత్రిలో జరిగేది కాదు. అది నిరంతర ఆరోగ్యకరమైన జీవనశైలితోనే సాధ్యం.